మెరిసే ‘మణి’ ఎవరు?
ఆస్కార్ ప్రతిమను ముద్దాడే అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు నామినేషన్లు దక్కించుకున్న అందరూ. ఉత్తమ నటి విభాగంలో నామినేషన్లు అందుకున్న వోలా డేవిస్, ఆండ్రా డే,....
ఆస్కార్ ప్రతిమను ముద్దాడే అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు నామినేషన్లు దక్కించుకున్న అందరూ. ఉత్తమ నటి విభాగంలో నామినేషన్లు అందుకున్న వోలా డేవిస్, ఆండ్రా డే, వనెస్సా కిర్బీ, క్యారీ ముల్లిగన్, ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్...ఇలా అందరూ వారు నటించిన చిత్రాల్లో అద్భుతంగా జీవించారు. తమ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నవారే. వీళ్లలో కొందరు నటీమణులు గతంలో ఆస్కార్ పురస్కారాలు గెలుచుకున్నారు. కొందరు తొలిసారి ఆ అవకాశం కోసం ఆశగా చూస్తున్నారు. మరి ఐదుగురిలో ఉత్తమ నటిగా నిలిచేదెవరు?
ఉత్తమ నటిగా రెండోసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది ఆఫ్రికన్ అమెరికన్ నటి వోలా డేవిస్. ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’ చిత్రంలో మా రైనీ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ఈ నటనే ఆమెకు 93వ ఆస్కార్ రేసులో నామినేషన్ వచ్చేలా చేసింది. ఈ చిత్రంలో ‘బ్లూస్’ అనే జానపద గాయనిగా వోలా అద్భుతంగా నటించింది. గతంలో ‘ఫెన్సెస్’ చిత్రానికి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ పురస్కారం అందుకున్నారు వోలా డేవిస్. ఆమె ‘ది హెల్ప్’ చిత్రంలోని నటనకు 2011లో ఉత్తమ నటిగా ఆస్కార్ నామినేషన్ దక్కించు కున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెర మీద అలరించిన ఆమె ట్రస్ట్, డౌట్, సూసైడ్ స్క్వాడ్, లీలా అండ్ ఈవ్, విడోస్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రకటించిన 21వ శతాబ్దంలో 25 గొప్ప నటుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచారు డేవిస్.
కెరీర్ తొలినాళ్లలోనే ఆస్కార్నామినేషన్ దక్కించుకున్న అమెరికన్ నటి ఆండ్రా డే. ‘ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే’ చిత్రంలోని నటనకే ఈ నామినేషన్. ఓ విధంగా చెప్పాలంటే తొలి చిత్రానికే ఆమెకు ఈ గౌరవం దక్కినట్టే లెక్క. ఎందుకంటే ఆమె నటించిన తొలి చిత్రం ‘మార్షల్’లో ఆమెది ఓ చిన్న పాత్ర అంతే. రెండోది యానిమేటెడ్ చిత్రం ‘కార్స్ 3’. ఇందులో స్వీట్ టీ అనే పాత్రకి గొంతు మాత్రమే ఇచ్చింది ఆండ్రా డే. ‘ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే’ చిత్రంలో ఆమె ప్రముఖ గాయని బిల్లీ హాలీడే జీవిత కథతో నటించింది. 1940 ప్రాంతంలో అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన బిల్లీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఉన్నాయి. ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది ఆండ్రా డే. ఆమె అసలు పేరు కసాండ్ర మోనిక్ బాటీ. స్వతహానే బిల్లీ డేను స్ఫూర్తిగా తీసుకునే కసాండ్ర ఆమె జీవిత కథలోనే నటించింది. అంతేకాదు బిల్లీ డే స్టేజ్ నేమ్ ‘లేడీ డే’ స్ఫూర్తితోనే తన పేరుని ఆండ్రా డేగా పెట్టుకుంది.
తొలిసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న మరో నటి ‘వనెస్సా కిర్బీ’. ఆమె నటించిన ‘పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్’ చిత్రంలోని మార్తా పాత్ర ఆమెకు ఈ నామినేషన్ వచ్చేలా చేసింది. మార్తా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. కొద్ది సేపట్లోనే ఆ పాప చనిపోతుంది. దీంతో కుటుంబంలో కలతలు మొదలవుతాయి. మార్తా తల్లి ఆ పాపను దహనం చేయాలంటే మార్తా మాత్రం పరిశోధనలకు ఇవ్వాలనుకుంటుంది. ఆమె భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. ఇలాంటి ఓ కుటుంబ డ్రామాలో హృదయానికి హత్తుకునేలా భావోద్వేగాలను పలికించింది కిర్బీ. ‘మిషన్ ఇంపాజిబుల్: ఫాలవుట్’, మిషన్: ఇంపాజిబుల్ 7 చిత్రాల్లోనూ నటించింది కిర్బీ. మిషన్: ఇంపాజిబుల్ 8లో ఆమె నటిస్తోంది.
స్వేచ్ఛనిచ్చే తల్లిగా, వేధింపులకు గురైన భార్యగా, వ్యభిచారిణిగా, సంచార జీవితాన్ని గడిపే నోమ్యాడ్గా ...ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్. ఆమె తన 40 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్ ఉత్తమ నటి కిరీటం అందుకున్న ఆమె మూడోసారి రేసులోకి వచ్చారు. రోడ్డు ప్రయాణంలోనే కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఒక చోట స్థిరంగా ఉండకుండా సంచారం చేసే నోమ్యాడ్స్ నేపథ్యంతో తీర్చిదిద్దిన కథతో తెరకెక్కిన చిత్రం ‘నోమ్యాడ్‌ల్యాండ్’. ఇందులో భర్తను కోల్పోయిన 61 ఏళ్ల ఫెర్న్ అనే మహిళ పాత్రలో అద్భుతంగా నటించారు ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్. ఆమెకు ఈ చిత్రంలోని నటనకే 93వ ఆస్కార్ ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ దక్కింది. ‘బ్లడ్ సింపుల్’, ‘ఆల్మోస్ట్ ఫేమస్’, ‘ది మ్యాన్ హు వజ్నాట్ ధేర్’, ‘మిస్ పెట్రీగ్రూ లివ్స్ ఫర్ ఎ డే’, ‘మిసిసిప్పీ బర్నింగ్’, ‘నార్త్ కంట్రీ’, ‘లోన్ స్టార్’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు డోర్మెండ్.
నటిగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే ‘యాన్ ఎడ్యుకేషన్’ చిత్రానికి 2008లో ఉత్తమ నటిగా ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది క్యారీ ముల్లిగన్. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ‘ప్రామిసింగ్ యంగ్ ఉమెన్’ చిత్రంలోని నటనకు గానూ 93వ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఈ చిత్రంలో క్యాసీ థామస్ పాత్రలో ముల్లిగన్ నటించింది. క్యాసీ మెడిసన్ చదివే సమయంలో ఏ1మోన్రో అనే తన తోటి విద్యార్థి తన స్నేహితురాలు నీనా ఫిషెర్ను రేప్ చేస్తాడు. ఇది క్యాసీ మనసులో బలంగా నాటుకుపోతుంది. ఆ తర్వాత క్యాసీ ఏవిధంగా కక్ష తీర్చుకున్నది అనేది మిగిలిన కథ. ఇందులో క్యాసీగా ముల్లిగన్ నటన ఆకట్టుకుంటుంది. బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లనే అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి