NTR 30: సంగీత చర్చలు షురూ

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ - కొరటాల శివ కలయికలో మరో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న 30వ సినిమా అది.

Updated : 21 Nov 2022 07:12 IST

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ (NTR) - కొరటాల శివ (Koratala Siva) కలయికలో మరో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న 30వ (NTR 30) సినిమా అది. యువసుధ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. ఈ సినిమాకి సంబంధించిన పనులు ఊపందుకుంటున్నాయి. కొన్ని నెలలుగా పూర్వ నిర్మాణ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే సంగీత చర్చలు షురూ అయ్యాయి. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రత్యేకం కానుందంటూ అనిరుధ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని