Ott Movies This Week: ఈ వారం ఓటీటీలో 25కు పైగా చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు!

Ott Movies This Week in telugu: ఇటీవల థియేటర్‌లో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు ఈ వారం సిద్ధమయ్యాయి. అలాగే పలువురు నటులు సరికొత్త వెబ్‌సిరీస్‌లతోనూ నెటిజన్ల ముందుకు రాబోతున్నారు.

Updated : 14 Sep 2023 15:28 IST

ఓటీటీలో అలరించేనా?

గోపీచంద్‌ (Gopi Chand) కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామబాణం’ (Rama banam ott release). డింపుల్‌ హయాతి కథానాయిక. జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. గోపిచంద్‌-శ్రీవాస్‌ హిట్ కాంబినేషన్‌ ఆ మేజిక్‌ను పునరావృతం చేయలేకపోయింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి ‘రామబాణం’ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.


మెగా మూవీ వచ్చేస్తోంది!

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’ (Bhola Shankar ott Release). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. ఇందులో చిరంజీవి సోదరిగా నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) కీలక పాత్ర పోషించారు. తమన్నా కథానాయిక. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. కాగా, ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.


హారర్‌ వెబ్‌సిరీస్‌తో వేణు..

ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు వేణు (Venu Thottempudi)  సరికొత్త వేదికపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కీలక పాత్రలో భరత్‌ వైజీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘అతిథి’ (Athidhi). డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా హారర్‌ నేపథ్యంలో సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచారం చిత్రం చూస్తే అర్థమవుతోంది. వేణుకు ఇదే తొలి వెబ్‌సిరీస్‌ కావడం గమనార్హం.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • వన్స్‌ అపాన్‌ ఏ క్రైమ్‌ (జపనీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • థర్స్‌డేస్‌ విడోస్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 15
  • ఎల్‌ కోండీ (స్పానిష్‌) సెప్టెంబరు 15
  • సర్వైవింగ్‌ సమ్మర్‌ (ఇంగ్లీష్‌-సీజన్‌2) సెప్టెంబరు 15
  • మిసెడ్యుకేషన్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 15
  • శ్రీ (హిందీ) సెప్టెంబరు 15
  • ఇన్‌సైడ్‌ ది వరల్డ్స్‌ టఫెస్ట్‌ ప్రిజన్స్‌ (ఇంగ్లీష్‌ -సిరీస్‌7)  సెప్టెంబరు 15
  • ది క్లబ్‌ (టర్కిష్‌) సిరీస్‌2 సెప్టెంబరు 15
  • ఆహా
  • మాయాపేటిక (తెలుగు) సెప్టెంబరు 15
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • అనీతి (తమిళ్‌) సెప్టెంబరు 15
  • డిజిటల్‌ విలేజ్‌ (మలయాళం) సెప్టెంబరు 15
  • ఎ మిలియన్‌ మైల్స్‌ ఎవే (హాలీవుడ్) సెప్టెంబరు 15
  • వైల్డ్‌నెస్‌ (ఇంగ్లీష్‌) సెప్టెంబరు 15
  • బొంబాయి మేరీజాన్‌ (తెలుగు/హిందీ) సీజన్‌-1 స్ట్రీమింగ్‌ అవుతోంది
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ది అదర్‌ బ్లాక్‌ గర్ల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 15
  • కాలా (హిందీ) సెప్టెంబరు 15
  • జీ5
  • హాస్టల్‌ హుడుగారు బేకిద్దారే (కన్నడ) సెప్టెంబరు 15
  • సోనీలివ్‌
  • జర్నీ ఆఫ్‌ లవ్‌ 18 ప్లస్‌(మలయాళం)సెప్టెంబరు 15
  • ఏ హనీమూన్‌ టూ రిమెంబర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 15
  • జియో సినిమా
  • ఫాస్ట్‌ ఎక్స్‌(తెలుగు, ఇంగ్లీష్‌) సెప్టెంబరు 15
  • ఈటీవీ విన్‌
  • దిల్‌ సే (తెలుగు) సెప్టెంబరు 16

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని