#REPUBLIC కలెక్టర్‌ పంజా అభిరామ్‌.. ఆగమనం ప్రకటించాడు..

టాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు ఓ పొలిటిక్‌ థ్రిల్లర్‌ సిద్ధమైంది. దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా ‘రిపబ్లిక్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా హీరో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్లు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.

Updated : 15 Aug 2021 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు ఓ పొలిటికల్‌ థ్రిల్లర్‌ సిద్ధమైంది. దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్‌ కథానాయకుడిగా ‘రిపబ్లిక్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా హీరో ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్లు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా ఇటీవల చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా.. విడుదలకు సంబంధించి చిత్రబృందం శుభవార్త చెప్పింది. అక్టోబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాయితేజ్‌ సరసన ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికగా సందడి చేయనుంది. జీ స్టూడియోస్‌ పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

ఈ సినిమాపై హీరో సాయితేజ్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. సినిమాలోని తన పాత్ర పేరును ‘పంజా అభిరామ్‌’ అని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ‘నా జీవితంలో ఇప్పటి వరకూ నేను ఎక్కువగా ప్రేమించిన పాత్ర ఇదే’ అంటూ అందులో పేర్కొన్నాడు. అంతేకాదు.. ‘దేవకట్టా దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, దీంతో పాటు కథ కూడా అద్భుతంగా ఉందని, అందుకే ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేశా’నని గతంలో చెప్పుకొచ్చాడు. ‘వైవిధ్యమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రం. సాయితేజ్‌ ఐఏఎస్‌ అధికారిగా శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారు. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని