Phalana Abbayi Phalana Ammayi : దశాబ్దపు ప్రేమ ప్రయాణం

నాగశౌర్య కథానాయకుడిగా శ్రీనివాస్‌ అవసరాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న మూడో సినిమా ఇది.

Updated : 03 Jan 2023 12:34 IST

నాగశౌర్య (Naga Shourya) కథానాయకుడిగా శ్రీనివాస్‌ అవసరాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. టీజీ విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్‌ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో శౌర్య, మాళవిక ఇద్దరూ ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. ‘‘ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం ఈ చిత్రం. 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సులా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించనున్నాం. ఈ సినిమాకి సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని