Dil Raju: ఆ ఉద్దేశంతోనే ‘ఎఫ్‌ 3’ టికెట్‌ ధరలు తగ్గించాం: దిల్‌రాజు

సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు స్పందించారు. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, సినిమాలు ఆగిపోయి బడ్జెట్‌లు పెరిగాయని అన్నారు.

Updated : 19 May 2022 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా టికెట్‌ ధరల తగ్గింపుపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) స్పందించారు. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, సినిమాల చిత్రీకరణ ఆగిపోయి బడ్జెట్‌లు పెరిగాయని అన్నారు. బడ్జెట్‌ పెరగడం వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘కేజీయఫ్‌ 2’ (KGF Chapter 2) సినిమాలకు టికెట్‌ ధరలు పెరిగాయని తెలిపారు. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూసేందుకు అలవాటుపడ్డారని పేర్కొన్నారు. ధరల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరమవుతున్నారని చెప్పారు. ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల రిపీట్‌ ఆడియన్స్‌ తగ్గిపోయారని వివరించారు. పాత జీవో ప్రకారం, ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలనే ఉద్దేశంతో తాను నిర్మించిన ‘ఎఫ్‌ 3’ (F 3) చిత్రానికి టికెట్‌ ధరలు తగ్గించామన్నారు. వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. గతంలో మంచి విజయం అందుకున్న ‘ఎఫ్‌ 2’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం మే 27న విడుదలకానుంది. ఈ మేరకు టికెట్‌ ధరలను తగ్గిస్తున్నట్టు చిత్ర బృందం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని