Dil Raju: యశ్‌తో దిల్‌ రాజు సినిమా.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌

తాను నిర్మించిన తొలి సినిమా ‘దిల్‌’ విడుదలై ౨౦ ఏళ్లు పూర్తైన సందర్భంగా దిల్‌రాజు ట్విటర్‌ వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఆయనకు ఎదురైన ప్రశ్నలేంటంటే?

Updated : 11 Apr 2023 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్న కథలతో సినిమాలను నిర్మిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ (Sri Venkateswara Creations). ‘దిల్‌’ (Dil)తో మొదలైన ఆ సంస్థ ప్రస్థానం నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత, తొలి చిత్రం ‘దిల్‌’ని ఇంటి పేరుగా మార్చుకున్న రాజు (Dil Raju) ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ‘మీ బ్యానర్‌లో యశ్‌తో సినిమా ఆశించొచ్చా’ అని ఒకరు అడగ్గా దిల్‌ రాజు ‘ఎస్‌’ అని బదులిచ్చారు. దాంతో, యశ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.  ‘ఆశించొచ్చు’ అనే మాటే తప్ప దిల్‌రాజు ఏ వివరాలు వెల్లడించలేదు. కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ (KGF)లతో సంచలనం సృష్టించిన యశ్‌ (Yash) తదుపరి చిత్రం తెలుగు నిర్మాణ సంస్థలో చేయబోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. #Yash19 హ్యాష్‌ట్యాగ్‌ని జతచేస్తున్నారు. మరి, ఈ కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. దిల్‌ రాజు చెప్పిన మరిన్ని సంగతులివీ..

* రామ్‌చరణ్‌ హీరోగా నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎలా ఉండబోతోంది?

దిల్‌ రాజు: చరణ్‌ అభిమానులతోపాటు ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది. త్వరలోనే ఆ చిత్రం నుంచి ఓ అప్‌డేట్‌ వస్తుంది.

* ‘శాకుంతలం’ గురించి ఏమైనా చెబుతారా?

దిల్‌ రాజు: అందరికీ నచ్చే క్లాసీ ఫిల్మ్‌.

*  మీ నిర్మాణంలో హీరో యశ్‌ సినిమాని ఆశించొచ్చా?

దిల్‌ రాజు: ఆశించొచ్చు.

* చిరంజీవితో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా రూపొందించండి.

దిల్‌ రాజు: అతి త్వరలోనే.. పూనకాలు లోడింగ్‌!

* పవన్‌కల్యాణ్‌తో మరో చిత్రం ఎప్పుడు నిర్మిస్తారు?

దిల్‌ రాజు: త్వరలోనే ఉంటుంది.

* మీ బ్యానర్‌లో ప్రభాస్‌తో సినిమా ఎప్పుడొస్తుంది?

దిల్‌ రాజు: ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రభాస్‌తో సినిమా చేస్తా.

* బాలకృష్ణతో ఓ చిత్రం ప్లాన్‌ చేయొచ్చుగా..?

దిల్‌ రాజు: తప్పకుండా. నాక్కూడా ఆయనతో సినిమా చేయాలనుంది.

* ఎన్టీఆర్‌తో సినిమా ఎప్పుడు?

దిల్‌ రాజు: త్వరలోనే.

* నానితో మీ బ్యానర్‌లో మరో సినిమా ఆశించొచ్చా?

దిల్‌ రాజు: అందులో సందేహం వద్దు. హ్యాట్రిక్‌కు ప్లాన్‌ చేస్తున్నాం.

* ఇప్పటి వరకూ మీరు నిర్మించిన వాటిల్లో మీకు బాగా నచ్చిన సినిమా?

దిల్‌ రాజు: బొమ్మరిల్లు.

* మీ డ్రీమ్‌ ప్రాజెక్టు ఏంటి?

దిల్‌ రాజు: ‘జటాయు’ అనేది నా కలల ప్రాజెక్టు. ది బెస్ట్‌ టెక్నిషియన్లు, నటులతో ఆ భారీ చిత్రాన్ని నిర్మించాలనే ప్రణాళిక రచిస్తున్నా.

* అప్‌కమింగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌కి మీరిచ్చే సలహా?

దిల్‌ రాజు: ఫోకస్‌తో పనిచేయాలి. ప్యాషన్‌, డెడికేషన్ ఉండాలి. ప్రతి సినిమాని తొలి సినిమాలానే భావించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని