Puri Musings: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పూరీ జగన్నాథ్ సూచన
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చిన్న సలహా ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం సంస్థకు పెట్టే పేరు, మార్కెటింగ్ మాత్రమే కాకుండా.. ఆ టౌన్షిప్ బోర్డు కూడా భారీ...
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ చిన్న సలహా ఇచ్చారు. వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కేవలం సంస్థకు పెట్టే పేరు, మార్కెటింగ్ మాత్రమే కాకుండా.. ఆ టౌన్షిప్ బోర్డు కూడా భారీగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు తాజాగా ఆయన ‘హాలీవుడ్’ అంశంపై ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘హాలీవుడ్’ అంటే కేవలం సినిమా అని మాత్రమే గుర్తుకొస్తుందని.. కానీ దాని వెనుక వేరే కథ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
‘‘హాలీవుడ్.. ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు. హాలీవుడ్లో పనిచేయాలనేది ప్రతి ఒక్కరి కల. అసలు ఈ పేరు ఎలా వచ్చిందంటే.. హార్వే హెండర్సన్ విల్కాక్స్ (Harvey Henderson Wilcox) అనే వ్యక్తికి లాస్ ఏంజెల్స్‌లో ఓ పెద్ద రాంచ్(Ranch) ఉండేది. ఆ స్థలంలో విట్లీ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ప్లాట్స్ వేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ ప్రాజెక్ట్‌కి హార్వే వాళ్ల సతీమణి ‘హాలీవుడ్’ (ది ల్యాండ్ ఆఫ్ హోలీ బుష్) అనే పేరు పెట్టింది. లాస్ ఏంజెల్స్ అనేది ఎడారి ప్రాంతం. అలాంటి ఈ ప్రాంతంలో మొక్కలు, చెట్లు రాబోతున్నాయి అని దాని అర్థం. 1887లో హాలీవుడ్‌ని ప్రారంభించి.. అందర్నీ ఆకర్షించడం కోసం అక్కడ కొండ మీద హాలీవుడ్ అని భారీగా రాశారు. సుసంపన్న, ప్రసిద్ధ నివాస ప్రాంతం అని చెబుతూ విట్లీ మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు.
1910లో అక్కడి ప్రభుత్వం దాన్ని మున్సిపాలిటీగా మార్చింది. దాంతో అక్కడ ఎక్కువగా సినిమావాళ్లు స్థలాలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత సినిమా చేయాలంటే హాలీవుడ్ సరైన ప్రాంతంగా మారింది. దానికి మరొక కారణం కూడా ఉంది. థామస్ అల్వా ఎడిసన్ 21 ఏళ్లకే దాదాపు 1000 పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేయించుకున్నాడు. టెలీగ్రాఫ్, టెలీఫోన్, మైక్రోఫోన్, మోషన్ పిక్చర్.. ఇలా చాలా పేటెంట్ రైట్స్ అతని దగ్గర ఉండేవి. ఎవరైనా మోషన్ పిక్చర్ తీయాలంటే అతడ్ని కలవాల్సి వచ్చేది. ఆ రోజుల్లో హాలీవుడ్ ఏరియాలో ఉండేవారికి అది వర్తించేది కాదు. దాంతో ‘‘ఇఫ్ యూ వాంట్ టు మేక్ మూవీస్, గో టు హాలీవుడ్. ఇట్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ టు మేక్ మూవీస్’’ అనే స్లోగన్ వచ్చింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రకృతి అందాలు కూడా మూవీ మేకింగ్‌కు ఎంతో ఉపయోగపడేవి. దాంతో హాలీవుడ్ అనేది సినిమాలకు ఉత్తమమైన ప్రాంతంగా మారింది.
ఆ తర్వాత మిస్టర్ ఖన్నా అనే వ్యక్తి హాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ పెట్టారు. బాలీవుడ్ అనే మాట తనకు నచ్చలేదని అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి మరీ ఖన్నాను తిట్టారు. కానీ, అప్పటికే మీడియాలో అందరూ రాసేయడం వల్ల ఆ పేరు పాపులర్ అయిపోయింది. దాన్ని చూసి మనం టాలీవుడ్, కోలీవుడ్ అని పెట్టుకున్నాం. మనమే కాదు కొరియన్ వాళ్లు హోయూవుడ్, పాకిస్థాన్ వాళ్లు లాలీవుడ్ అని పెట్టుకున్నారు. కానీ యూకే, కెనడాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ హాలీవుడ్ కిందకు రాదు. ఇవన్నీ పక్కన పెడితే హాలీవుడ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ బోర్డు. అది అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద అక్షరాలతో కొండపై పెట్టడం వల్ల దాని జాతకం మారిపోయింది. పాపులర్ అయిపోయింది. అందుకే రియల్ ఎస్టేట్ వాళ్లు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే.. టైటిల్, మార్కెటింగ్తోపాటు సైజ్ ఆఫ్ ది బోర్డ్ కూడా ఎంతో అవసరం. ఏ పేరు పెట్టినా పెద్ద బోర్డు మాత్రం పెట్టండి’’ అని పూరీ జగన్నాథ్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్‌లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ