Naga Shaurya: ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు

నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘రంగబలి’. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. శరత్‌ కుమార్‌, మురళీ శర్మ, సత్య, రాజ్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 09 Jul 2023 14:10 IST

నాగశౌర్య (Naga Shaurya), యుక్తి తరేజ జంటగా పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘రంగబలి’ (Rangabali). సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. శరత్‌ కుమార్‌, మురళీ శర్మ, సత్య, రాజ్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. పవన్‌ చాలా మంచి సినిమా తీశారు. ఓ మంచి కథ చెప్పారు. దీన్ని ప్రేక్షకులు చక్కగా ఆస్వాదిస్తున్నారు. ‘ఛలో’ తర్వాత నాకు ఈ ‘రంగబలి’ మరో బ్లాక్‌బస్టర్‌. యుక్తి చక్కగా నటించింది. సత్య, రాజ్‌కుమార్‌ బాగా అలరించారు’’ అన్నారు. ‘‘సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు పడిపడి నవ్వుతున్నారు. ప్రథమార్ధాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. శౌర్య, సత్య, రాజ్‌ కుమార్‌ పాత్రలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ద్వితీయార్ధంలో మంచి కథ, సందేశాన్ని చెప్పాం’’ అన్నారు దర్శకుడు పవన్‌. ఈ కార్యక్రమంలో యుక్తి, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని