జబర్దస్త్‌ కమెడియన్స్ కన్నీటి గాథలివి

ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కార్యక్రమాల వేదికగా తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు పలువురు కమెడియన్స్‌.....

Published : 18 Jun 2021 01:33 IST

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రసారమవుతున్న ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కార్యక్రమాల వేదికగా తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు పలువురు కమెడియన్స్‌. అలా, ప్రతి గురు, శుక్రవారాలు మనల్ని కడుపుబ్బా నవ్విస్తోన్న హాస్యనటుల జీవితాల్లో ఉన్న కన్నీటి గాథలు తెలియజేస్తుంది ఈ వారం ప్రసారం కానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలో వచ్చే వారం ‘ఫాదర్స్‌ డే’ స్పెషల్‌గా ‘నాన్నకు ప్రేమతో..’ ప్రసారం కానుంది. ఇందులో భాగంగా కెవ్వు కార్తిక్‌, ఇమ్మానుయేల్‌.. మరి కొంతమంది హాస్యనటులు.. తమ కన్నీటి కథలు, నాన్న గొప్ప తనాన్ని గురించి తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే జూన్‌ 20న ప్రసారం కానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని