Deepika Padukone: దీపికా పదుకొణెను పోలిన అమ్మాయి.. థ్రిల్‌ అవుతున్న నెటిజన్లు!

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటుంటాం. ‘టిక్‌టాక్‌’ ద్వారా సినీ తారలను పోలిన కొందరు వ్యక్తులను చూశాం. మహేశ్‌బాబు, ప్రభాస్‌, ధనుష్‌.. ఇలా పలువురు నటులను తలపించేలా ఆహార్యం ఉన్న వారు ఎంతోమందిని ఆకట్టుకున్నారు.

Published : 14 Jul 2022 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటుంటాం. ‘టిక్‌టాక్‌’ ద్వారా సినీ తారలను పోలిన కొందరు వ్యక్తులను చూశాం. మహేశ్‌బాబు, ప్రభాస్‌, ధనుష్‌.. ఇలా పలువురు నటులను తలపించేలా ఆహార్యం ఉన్న వారు ఎంతోమందిని ఆకట్టుకున్నారు. పాపులారిటీని సంపాదించారు. ఇప్పుడా జాబితాలోకి చేరింది రిజుతా ఘోష్‌ (Rijuta Ghosh Deb). మాధ్యమం అదికాకపోయినా అదే స్థాయిలో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. కోల్‌కతాకు చెందిన ఈమె అచ్చం.. బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణెలా (Deepika Padukone) కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. రిజుతా.. డిజిటల్‌ క్రియేటర్‌. 2015లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన ఆమె కొన్నాళ్లు ఎక్కువగా వృత్తిపరమైన విశేషాలను పంచుకునేవారు. క్రమంగా తన స్టిల్స్‌ను షేర్‌ చేయడం ప్రారంభించారు. వాటిల్లో కొన్ని దీపికను తలపించేలా ఉండటంతో ఆమె ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టేవి. అలా ‘ఈమె ఎవరో తెలుసుకుందాం’ అంటూ ఆమె సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ చూసిన నెటిజన్లు థ్రిల్ అవుతున్నారు. ‘వావ్‌ మీరు దీపికలా ఉన్నారు’, ‘హో.. మిమ్మల్ని చూసి దీపికా పదుకొణె అనుకున్నా’, ‘మీరు దీపికా సిస్టరా’, ‘దీపికా 2. o’ అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. రిజుతాను ఇన్‌స్టాలో అనుసరిస్తున్న వారి సంఖ్య సుమారు 49,000.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని