Rudramkota: శ్మశానంలో పెరిగిన యువకుడి కథ

సీనియర్‌ నటి జయలలిత కీలక పాత్రలో నటిస్తూ, ఆమె సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. అనిల్‌ ఆర్కా కండవల్లి కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్నారు. విభీష, రియా కథానాయికలు. రాము కోన దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 27 Jul 2023 13:52 IST

సీనియర్‌ నటి జయలలిత కీలక పాత్రలో నటిస్తూ, ఆమె సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. అనిల్‌ ఆర్కా కండవల్లి కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్నారు. విభీష, రియా కథానాయికలు. రాము కోన దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమాని, వచ్చే నెలలో స్క్రీన్‌ మాక్స్‌ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా అనిల్‌ అర్కా కండవల్లి మాట్లాడుతూ ‘‘శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూర్చార’’ని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని