Meenakshi Chaudhary: మరో స్టార్‌హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?

ఇప్పటికే అగ్ర హీరోల సరసన నటిస్తున్న మీనాక్షి చౌదరి మరో స్టార్‌హీరోతో కలిసి నటించనుందని టాక్‌ వినిపిస్తోంది. ఆ హీరో ఎవరంటే..?

Published : 01 Oct 2023 22:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె మరో అవకాశం అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay)తో ఆడిపాడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్‌ హీరోగా దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘తలపతి 68’ (#Thalapathy68) అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమాలోనే మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైందంటూ కోలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. విజయ్‌ అభిమానులు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఈ విషయంపై చర్చ సాగిస్తున్నారు. విజయ్‌ తన అభిమాన నటుడని మీనాక్షి గతంలో చెప్పగా సంబంధిత క్లిప్పింగ్స్‌ను ఆమె అభిమానులు పోస్ట్‌ చేస్తున్నారు. దాంతో, ఆమె పేరు ‘ఎక్స్‌’లో ట్రెండింగ్‌ జాబితాలో నిలిచింది.

‘లియో’.. మైండ్‌ బ్లోయింగ్‌ మూవీ: గౌతమ్‌ మేనన్‌

మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan)- డైరెక్టర్‌ వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaska), వరుణ్‌ తేజ్‌ (Varun Tej)- కరుణ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మట్కా’ (Matka), విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో మీనాక్షినే హీరోయిన్‌. ఇప్పటికే ఆమె కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. విజయ్‌ ఆంటోనీ సరసన ‘కొలై’లో నటించింది. ఈ ఏడాది జులైలో ఆ చిత్రం విడుదలైంది. విజయ్‌ విషయానికొస్తే.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన ‘లియో’ (Leo) సినిమా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని