Gautham Menon: ‘లియో’.. మైండ్‌ బ్లోయింగ్‌ మూవీ: గౌతమ్‌ మేనన్‌

‘లియో’ (Leo) సినిమాలో గౌతమ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పారు.

Published : 01 Oct 2023 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లియో’ (Leo) ఒకటి. విజయ్‌ (Vijay) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) రూపొందిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు, నటుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా అత్యద్భుతంగా ఉండనుందని తెలిపారు.

‘‘విజయ్‌ నటించిన ‘లియో’ అక్టోబర్‌ 19న విడుదల కానుంది. మైండ్‌ బ్లోయింగ్‌ ఫిల్మ్‌. డబ్బింగ్‌ సమయంలో నా సీన్స్‌ చూశా. సినిమా సూపర్‌గా వచ్చింది. విజయ్‌తో వర్క్‌ చేయడం అద్భుతమైన అనుభూతి. ఉదయం 9 గంటలకు షూట్‌ అంటే.. ఆయన 7 గంటలకే సెట్‌లోకి వచ్చేసేవారు. డైలాగ్‌ పేపర్స్‌ తీసుకుని ప్రాక్టీస్‌ చేస్తుంటారు. వృత్తిపట్ల అంకితభావం, నిబద్ధత కలిగిన గొప్ప నటుడు ఆయన. చిత్రీకరణ సమయంలో మేము సరదాగా గడిపాం’’ అని ఆయన చెప్పారు.

Sitara: మహేశ్‌ తనయ మంచి మనసు.. ఫిదా అవుతోన్న నెటజన్లు

‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌-లోకేశ్‌ కాంబోలో వస్తోన్న చిత్రమిది. మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఇది సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 19న పాన్ ఇండియా స్థాయిలో దీనిని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని