Salaar: ‘సలార్‌’ సందడి... మే ఆఖరిలో!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘కె.జి.ఎఫ్‌2’ విడుదలైంది. రికార్డ్‌ స్థాయి ప్రారంభ వసూళ్లతో సందడి చేస్తోంది. ఇక ఇప్పుడందరి దృష్టి ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ - అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కలయికలో

Updated : 15 Apr 2022 11:14 IST

ప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘కె.జి.ఎఫ్‌2’ విడుదలైంది. రికార్డ్‌ స్థాయి ప్రారంభ వసూళ్లతో సందడి చేస్తోంది. ఇక ఇప్పుడందరి దృష్టి ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ - అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కలయికలో రూపొందుతున్న ‘సలార్‌’ సినిమాపైనే. ‘కె.జి.ఎఫ్‌’ తెరకెక్కించిన హోంబళే ఫిల్మ్‌ పతాకంపైనే రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ ‘కె.జి.ఎఫ్‌2’తో పాటే విడుదల కావొచ్చేమో అనే ప్రచారం సాగింది. అయితే మే నెలాఖరులో టీజర్‌ని విడుదల చేయాలని తాజాగా నిర్ణయించింది చిత్రబృందం. ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తుండగా, భువన్‌ గౌడ కెమెరా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.

* ‘కేజీఎఫ్‌-3 ఉంటుందని చిత్రబృందం ప్రకటించినట్లైంది. గురువారం ‘కేజీఎఫ్‌చాప్టర్‌-2’ సినిమా చివర్లో... దీనికి సంబంధించిన లీడ్‌ ఇచ్చారు దర్శకనిర్మాతలు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని