Jeevitha: ‘శేఖర్‌’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన జీవిత

రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శేఖర్‌’ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారని చిత్ర దర్శకురాలు జీవిత అన్నారు. ‘శేఖర్‌’ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ శనివారం ఉదయం టీమ్‌ స్పెషల్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది...

Published : 23 Apr 2022 14:01 IST

హైదరాబాద్‌: రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శేఖర్‌’ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారని చిత్ర దర్శకురాలు జీవిత అన్నారు. ‘శేఖర్‌’ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ శనివారం ఉదయం టీమ్‌ స్పెషల్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. మే 20న ‘శేఖర్‌’ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రెస్‌మీట్‌లో భాగంగా జీవిత మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని సుధాకర్‌ రెడ్డి, వెంకట శ్రీనివాస్‌లతోపాటు నా కుమార్తె శివాని, శివాత్మిక నిర్మించారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో మాకెన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ మాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు. తదుపరి సినిమా పనుల్లో రాజశేఖర్‌ బిజీగా ఉన్నారు. సోమవారం ఆయనకు లుక్‌ టెస్ట్‌ ఉంది. అందుకే ఆయన ఈరోజు ప్రెస్‌ ముందుకు రాలేదు’’ అని తెలిపారు. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్‌’కు రీమేక్‌గా ఈసినిమా రూపుదిద్దుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని