పాయల్‌ కరోనా టెస్ట్‌.. వజ్ర ఊర్వశి.. ప్రమోదగా శోభిత

‘మేజర్‌’ చిత్రంలోని శోభిత ధూళిపాళ్ల పాత్రను పరిచయం చేశారు కథానాయకుడు అడవి శేష్‌. ఈయన హీరోగా శశి కిరణ్‌ తిక్క తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘మేజర్‌’.

Published : 10 Apr 2021 01:12 IST

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మేజర్‌’ చిత్రంలో శోభిత ధూళిపాళ్ల పాత్రను పరిచయం చేశారు కథానాయకుడు అడవి శేష్‌. ఈయన హీరోగా శశి కిరణ్‌ తిక్క తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘మేజర్‌’.

* తాను పెంచుకుంటోన్న కుక్క ఫొటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు నటి రేణు దేశాయ్‌.

* ‘3 రోజెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది పాయల్ రాజ్‌పూత్‌. దీని షూటింగ్‌కు ముందు ఆమె కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు. ఈ సందర్భంగా టెస్ట్‌ చేసిన వెంటనే ‘రిజల్ట్‌’ ఏంటి? అని అడగటం నవ్వులు పూయిస్తోంది.

* డైమండ్లతో కూడిన కిరీటంతో ముఖాన్ని నింపేసింది బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతెలా. అది చాలా బరువుగా ఉందంటూ చెప్పుకొచ్చింది. 

నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. నన్ను బాగా నవ్విస్తుంది.. సంతోషంగా ఉంచుతుంది అంటూ నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి ఇన్‌స్టా వేదికగా తెలియజేశారు మంచు లక్ష్మి. ఇద్దరూ కలిసి చిరు నవ్వులు చిందిస్తున్న ఫొటోని పంచుకున్నారామె.

























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని