Sridevi Shoban Babu: శోభన్‌బాబు.. శ్రీదేవి.. ఓ ప్రేమకథ

సంతోష్‌ శోభన్‌ హీరోగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. గౌరి జి కిషన్‌ నాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో

Updated : 07 Dec 2022 16:09 IST

సంతోష్‌ శోభన్‌ హీరోగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. గౌరి జి కిషన్‌ నాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇటీవల విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇదొక విభిన్నమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో శోభన్‌బాబుగా సంతోష్‌ నటించగా.. శ్రీదేవి పాత్రలో గౌరి నటించింది. సంతోష్‌ ఎక్కువగా మాట్లాడే కుర్రాడిగా కనిపిస్తే.. గౌరి టెంపర్‌ ఉన్న అమ్మాయిగా కనిపించింది. విభిన్నమైన వ్యక్తిత్వాలున్న వారి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమ్రాన్‌ స్వరాలు సమకూర్చారు. శశిధర్‌ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరించగా.. సిద్ధార్థ్‌ రామస్వామి ఛాయాగ్రహణం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని