
Nora Fatehi: ఈడీ విచారణకి హాజరైన నోరా..
ముంబయి: మనీ లాండరింగ్ కేసుకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకి బాలీవుడ్ నటి నోరా ఫతేహి గురువారం హాజరయ్యారు. వివిధ కోణాల్లో ఈడీ అధికారులు ఆమెని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆమె లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. గతంలో రూ. 200 కోట్ల ఛీటింగ్ కేసులో నటి లీనా పాల్, ఆమె భర్త సుకేశ్ చంద్రశేఖర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా నోరా ఫతేహి, జాక్వెలిన్‌కు సుకేశ్లతో ఆర్థిక లావాదేవీలను ప్రశ్నించారు. ఈ మేరకు నోరాకి సమన్లు జారీ చేయడంతో ఈ రోజు ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే ఓసారి విచారణకి హాజరైన జాక్వెలిన్ శుక్రవారం మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.