Samantha: సమంత అయినా.. సామాన్యులైనా.. కోర్టు ముందు ఒక్కటే!

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ సినీ నటి సమంత నిన్న కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్‌పై త్వరగా

Published : 22 Oct 2021 01:43 IST

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ సినీ నటి సమంత నిన్న కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సెలబ్రిటీలను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. కోర్టు ముందు అందరూ సమానమేనన్నారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటేనని స్పష్టం చేశారు. కోర్టు సమయం చివరలో పిటిషన్‌పై విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. 

సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతో పాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై పరువునష్టం దావా దాఖలు చేశారు. నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారన్నారు. మీడియా, పత్రికల ద్వారా వారు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని.. పరువు నష్టం ఎంతనేది తర్వాత కోరతానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని