Samantha: నాగ్‌ మామ నువ్వు ఓ అద్భుతం: సమంత

తన మామయ్య నాగార్జున అద్భుతమైన వ్యక్తి అని నటి సమంత అన్నారు. ఆదివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మామయ్యపై తనకున్న....

Published : 29 Aug 2021 14:12 IST

కింగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు

హైదరాబాద్‌: తన మామయ్య నాగార్జున అద్భుతమైన వ్యక్తి అని నటి సమంత అన్నారు. ఆదివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆమె ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మామయ్యపై తనకున్న అభిమానాన్ని చెప్పడానికి మాటలు సరిపోవని ఆమె అన్నారు. సమంత మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు ఆయనకు విషెస్‌ తెలుపుతూ నెట్టింట్లో పోస్టులు పెట్టారు.

‘అద్భుతమైన వ్యక్తి నాగ్‌ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై నాకున్న గౌరవం, అభిమానాన్ని చెప్పడానికి పదాలు సరిపోవు. మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలి’ - సమంత

‘ఇప్పటికీ ఎప్పటికీ నా మనసుకు దగ్గరమైన ప్రియనేస్తం నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించగలిగే వ్యక్తివి నువ్వు. ఒక నటుడిగా ప్రతిసారీ ప్రయోగాలు చేస్తూ.. నీ పరిధిని విస్తృతం చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ - చిరంజీవి

‘నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, ఆనందం, మరెన్నో విజయాలు మీ సొంతం కావాలని కోరుకుంటున్నాను. డియర్‌ నాగ్‌.. నీ జీవిత భాగస్వామినైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా జీవించండి ’ - అమల అక్కినేని

‘అన్ని రకాల జోనర్లలో ప్రతిసారీ ప్రయోగాలు చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకుల్ని అలరిస్తున్న కింగ్‌ నాగార్జనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మొత్తం మీకు మరింత సూపర్‌గా సాగాలని కోరుకుంటున్నా’ - క్రిష్‌

‘బంగారం లాంటి మనసు కలిగిన అద్భుతమైన నటుడు మన టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జునకు హ్యాపీ బర్త్‌డే. మీరు మరెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మమ్మల్ని అలరించాలి’ - బాబీ

‘హ్యాపీ బర్త్‌డే నాగార్జున బాబు. ఈరోజు నేను డైరెక్టర్‌గా ఉన్నానంటే దానికి కారణం మీరు. ‘మాస్‌’ సినిమాతో మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తున్నా’ - రాఘవ లారెన్స్

‘అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నవ మన్మథుడు నాగార్జున. హ్యాపీ బర్త్‌డే సర్‌’ - రాహుల్‌ రవీంద్ర

‘ఎవర్‌గ్రీన్‌ ట్రెండ్‌సెట్టర్‌ కింగ్‌ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి వ్యక్తి, నటుడిగా ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. మీరు ఆరోగ్యంగా జీవించాలి’ - మంచు లక్ష్మి








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని