MAA Elections: ‘మా’ ఎన్నికల బరిలో వీరే.. ఫైనల్ లిస్ట్ ఇదే!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల

Published : 02 Oct 2021 21:19 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెల్లడించారు. 2021-23 కార్యవర్గానికి సంబంధించి మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతుండగా... స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీవీఎల్ నరసింహారావు, కె.శ్రావణ్ కుమార్ చివరి నిమిషంలో తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య అధ్యక్ష పోటీ ఖరారైంది.

మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో ఉండే రెండు వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు మంచు విష్ణు ప్యానెల్ నుంచి పృథ్వీరాజ్, మాదాల రవి పోటీలో ఉండగా.. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి బెనర్జీ, హేమ (విష్ణు ప్యానెల్‌) పోటీలో ఉన్నారు. ఇక మా అసోసియేషన్ లో అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు జీవితా రాజశేఖర్, రఘుబాబు, బండ్ల గణేశ్ నామినేషన్ దాఖలు చేయగా... పెద్దల సూచలతో బండ్ల గణేశ్ తప్పుకున్నారు. దీంతో ఆ పోస్టుకు జీవితా రాజశేఖర్(ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌), రఘుబాబు(విష్ణు ప్యానెల్‌)లు బరిలో నిలిచారు.

కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీలో ఉండగా... రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి లు పోటీలో ఉన్నట్లు కృష్ణమోహన్ తెలిపారు. అలాగే అసోసియేషన్‌లోని 18 ఈసీ పోస్టులకు 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో తుది జాబితాను వెల్లడించిన కృష్ణమోహన్... అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఫిల్మ్‌నగర్‌లోని జూబ్లీ పబ్లిక్ పాఠశాలలో జరిగే మా ఎన్నికలకు ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపనున్నట్లు కృష్ణమోహన్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని