MAA Elections: బండ్ల గణేశ్‌తో నాకు ఎలాంటి విభేదాల్లేవు: జీవితా రాజశేఖర్‌

బండ్ల గణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని నటి జీవితా రాజశేఖర్‌ అన్నారు. ఈ ఏడాది జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం..

Published : 06 Sep 2021 01:10 IST

హైదరాబాద్‌: బండ్లగణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని నటి జీవితా రాజశేఖర్‌ అన్నారు. ఈ ఏడాది జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరఫు నుంచి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీ చేస్తున్న జీవిత తాజాగా ఓ ఛానల్‌తో మాట్లాడారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి జీవిత ఎంట్రీ ఇవ్వడం తనకి నచ్చలేదని.. అందుకే ఆమెకు వ్యతిరేకంగా జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీలోకి దిగుతున్నానంటూ బండ్లగణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘మా’లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా ‘మా’ అభివృద్దికి పనిచేసి తీరతానన్నారు.

‘‘మా’ అనేది అందరిది. ఇక్కడ ఎవరి మధ్య పోటీ లేదు. ప్యానల్‌లో ఉన్నవాళ్లే ఎన్నికల్లో పోటీ చేయాలి? ప్యానల్‌లో లేనివాళ్లు పోటీ చేయకూడదు అనేది లేదు. సభ్యులుగా ఉన్న వాళ్లు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడాలనే ఆలోచన అందరిలో ఉంది. బండ్ల గణేశ్‌ కూడా ‘మా’ అభివృద్ధి కోసం కృషి చేయాలనుకుంటున్నారు. అందుకే ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. అంతేకానీ, నాకు వ్యతిరేకంగానో, లేదా నెగటివిటీతోనే ఆయన పోటీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమంతా ఒక్కటే. మేమంతా కలిసే పనిచేస్తాం.  ఈ ఎన్నికల్లో నేను గెలిచినా, లేదా ఓడినా సరే ‘మా’ కోసం పనిచేస్తా’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని