Manchu manoj: మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా జాతికి అవమానమే

దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని నటుడు మంచు మనోజ్‌ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళల భద్రత కోసం ప్రతిఒక్కరూ....

Published : 17 Sep 2021 17:26 IST

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని నటుడు మంచు మనోజ్‌ అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మహిళల భద్రత కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం మనోజ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘‘ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు. దేశ సమస్య. మహిళకు అన్యాయం ఎక్కడ జరిగినా జాతికి అవమానమే. భవిష్యత్తులో ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా ఉండేందుకు అందరూ ఒక్కటిగా పోరాటం చేద్దాం. రాజకీయ పార్టీలు, అజెండాలు, రాష్ట్రాలు, భాషలు.. వీటికి అతీతంగా మహిళల భద్రత కోసం పోరాటం కొనసాగిద్దాం. ఇటీవల ఓ రాజకీయ పార్టీకి చెందిన ఫాలోవర్స్ నుంచి ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ రావడం చూశాను. మీకిష్టమైన రాజకీయ పార్టీ కోసం కాకుండా మహిళల రక్షణ గురించి ఆలోచించండి. మన ఇంటి ఆడబిడ్డలకు మెరుగైన సమాజాన్ని సిద్ధం చేద్దాం. ‘ఒక్కరి కోసం అందరూ.. అందరి కోసం ఒక్కరూ.. కలిసి ఉంటేనే నిలబడగలం’’ అని మనోజ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని