
Nayanthara: విఘ్నేశ్ శివన్‌తో ఇకపై అక్కడే ఉండనున్న నయన్
చెన్నై: అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ వరుస ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు నటి నయనతార. కథానాయికగానే కాకుండా తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌శివన్‌తో కలిసి కొన్ని సినిమాలకు నిర్మాతగానూ ఆమె వ్యవహరిస్తున్నారు. కాగా, తాజాగా నయనతారకు సంబంధించిన ఓ విషయం కోలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చెన్నై నగరంలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటోన్న నయన్ త్వరలోనే కొత్త ఇంటికి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, ధనుష్ వంటి సెలబ్రిటీలు నివసిస్తున్న పోయస్ గార్డెన్‌లో ఓ ఖరీదైన ఇంటిని ఆమె కొనుగోలు చేశారట.
నాలుగు పడక గదులతో ఉన్న ఈ ఇంటి కోసం నయన్ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టారని.. త్వరలోనే విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఆమె గృహప్రవేశం చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతంలో ఆమె త్వరలోనే మరో ఇంటిని సైతం కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు పలు పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా నయన్-విఘ్నేశ్ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోనున్నారని టాక్. వివాహం తర్వాత ఈ జంట నివసించడం కోసమే కొత్త ఇంటిని కొనుగోలు చేసి ఉంటారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే వీళ్లిద్దరికీ నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నయన్ తెలుగులో తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’, తమిళంలో ‘కాతువక్కుల రెందు కాదల్’, ‘కనెక్ట్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.