Oh My God 2: బుల్లితెర శ్రీరాముడు వెండితెరపైకి..

‘రామాయణ్‌’ (1987) అనే హిందీ ధారావాహికలో  శ్రీరాముడి పాత్ర పోషించి, విశేష గుర్తింపు పొందిన నటుడు అరుణ్‌ గోవిల్‌. శ్రీరాముడు అంటే అరుణ్‌ అనేంతగా తన ప్రతిభ చూపారాయన.

Published : 18 Oct 2021 23:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రామాయణ్‌’ (1987) అనే హిందీ ధారావాహికలో శ్రీరాముడి పాత్ర పోషించి, విశేష గుర్తింపు పొందిన నటుడు అరుణ్‌ గోవిల్‌. శ్రీరాముడు అంటే అరుణ్‌ అనేంతగా ప్రతిభ చూపారాయన. అలా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన ఆయన అదే పాత్రతో తొలిసారి వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు. పంకజ్‌ త్రిపాఠి, అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మై గాడ్‌ 2’. యామీ గౌతమ్‌ కథానాయిక. ఈ సినిమాలో కీలకమైన రాముడి పాత్రకి అరుణ్‌ ఎంపికయ్యారు.  గతంలో వచ్చిన ‘ఓ మై గాడ్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ రూపొందుతోంది. అశ్విన్‌ వర్డే, అక్షయ్‌ కుమార్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

హిందీ, భోజ్‌పురి, ఒరియా, తెలుగు తదితర భాషల్లో అరుణ్‌ నటించారు. సీరియల్‌, సినిమా.. మాధ్యమం ఏదైనా తన మార్క్‌ చూపించారు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘గోవిందా గోవిందా’ చిత్రంలో శ్రీ మహా విష్ణువు పాత్ర పోషించి, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాత, రాజకీయవేత్తగానూ తనదైన ముద్రవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని