Prabhas: బాలీవుడ్ స్టార్‌హీరో ఫ్యామిలీకి ప్రభాస్ స్పెషల్ సర్‌ప్రైజ్
ముంబయి: బాలీవుడ్ స్టార్‌హీరో సైఫ్ అలీఖాన్ కుటుంబానికి పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తాజాగా కరీనాకపూర్ బయటపెట్టారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనుల్లో భాగంగా ముంబయిలో ఉంటున్న ప్రభాస్ తాజాగా తన కోస్టార్ సైఫ్ కుటుంబానికి భోజనాన్ని పంపించారు. స్పెషల్‌గా బిర్యానీ, నాన్‌వెజ్ కర్రీ, ఖీర్ సిద్ధం చేయించి అందించారు. ప్రభాస్ చూపించిన అభిమానం పట్ల కరీనా ఆనందం వ్యక్తం చేశారు. ‘బాహుబలే బిర్యానీ పంపిస్తే.. అది ది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. రుచికరమైన భోజనాన్ని పంపించినందుకు థ్యాంక్యూ ప్రభాస్’ అని కరీనా పోస్ట్ పెట్టారు.
సాధారణంగా ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తనతో వర్క్ చేసే కోస్టార్స్‌కి ఆయన వివిధ రకాలైన వంటకాలను రుచి చూపిస్తుంటారు. ఇటీవల నటి భాగ్యశ్రీకి సైతం ప్రభాస్ పూతరేకులు గిఫ్ట్‌గా పంపించారు.
ఇక ‘ఆదిపురుష్’ విషయానికి వస్తే.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో.. సైఫ్ రావణుడి పాత్రలో సందడి చేయనున్నారు. ప్రభాస్‌కు జోడీగా సీతమ్మ పాత్రలో నటి కృతిసనన్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా టీసిరీస్ బ్యానర్‌పై తెరకెక్కనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Nellore: నెల్లూరులో ప్రారంభమైన రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
Sports News
Anand Mahindra : ఈ బల్లెం వీరుల అనుబంధానికి బంగారు పతకం ఇవ్వాలి..
-
Sports News
PV Sindhu : పీవీ సింధుకు డేవిడ్ వార్నర్ స్పెషల్ విషెస్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Taiwan: ఆక్రమణ కోసమే చైనా సన్నాహాలు
-
Movies News
Mahesh Babu: ‘ఆ సహృదయం పేరు మహేశ్ బాబు’.. సూపర్ స్టార్‌కు తారల విషెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!