RRR Trailer: వీరోచిత పోరాటాలు.. రోమాంచిత భావోద్వేగాలు

‘స్కాట్‌ దొరవారు మా ఆదిలాబాద్‌ వచ్చినప్పుడు ఓ చిన్న పిల్లను తీసుకొచ్చారు... మీరు తీసుకొచ్చింది గోండు పిల్లను’’ అంటూ సాగే రాజీవ్‌ కనకాల సంభాషణలతో ట్రైలర్‌ మొదలైంది. ‘‘అయితే వాళ్లకేమైనా రెండు కొమ్ములుంటాయా

Updated : 10 Dec 2021 09:16 IST

ఆకట్టుకుంటున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌

‘స్కాట్‌ దొరవారు మా ఆదిలాబాద్‌ వచ్చినప్పుడు ఓ చిన్న పిల్లను తీసుకొచ్చారు... మీరు తీసుకొచ్చింది గోండు పిల్లను’’ అంటూ సాగే రాజీవ్‌ కనకాల సంభాషణలతో ట్రైలర్‌ మొదలైంది. ‘‘అయితే వాళ్లకేమైనా రెండు కొమ్ములుంటాయా?’’ అంటే... ‘‘ఒక కాపరుంటాడు’’ అని చెబుతుంటే... ఎన్టీఆర్‌ మెరుపు వేగంతో పులిని నిలువరించే సన్నివేశాలు కన్పిస్తాయి. ‘‘పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి’’ అని మాటలు వినిపిస్తుంటే రామ్‌చరణ్‌ గంభీరత్వాన్ని పరిచయం చేశారు.

‘‘పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతమన్నా’’ అని తెలంగాణ యాసలో ఎన్టీఆర్‌ సంభాషణలు వినిపిస్తుంటే... రామ్‌, భీమ్‌ పాత్రల మధ్య స్నేహాన్ని పరిచయం చేశారు. ‘‘బ్రిటీష్‌ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన నేరానికి నిన్ను అరెస్టు చేస్తున్నాను’’ అని రామ్‌చరణ్‌ పలికే మాటలతో ఇద్దరి మధ్య సంఘర్షణను చూపించారు. ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి’’ అని అజయ్‌దేవగణ్ పలికే సంభాషణలతో రామ్‌, భీమ్‌ పాత్రల తాలుకూ ఆవేశాన్ని కళ్లకు కట్టారు. ‘‘భీమ్‌ ఈ నక్కల వేట ఎంత సేపు... కుంభస్థలాన్ని కొడదాం పదా’’ అని రామ్‌చరణ్‌ అంటుంటే... అల్లూరి, కొమురం భీమ్‌ పాత్రలు బ్రిటీష్‌ వారిపై చేసే భీకర పోరును చూపించిన ఈ ట్రైలర్లో శ్రియ, అలియాభట్‌, ఒలివియా, సముద్రఖని ఇతర పాత్రల్లో కనిపించారు. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. సెంథిల్‌కుమార్‌ కెమెరా పనితనం ప్రతి సన్నివేశాన్ని కనులవిందుగా మార్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని