LEO: భారీ సెట్‌లో.. 500మంది డ్యాన్సర్లతో
విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’. లలిత్ కుమార్ నిర్మాత. త్రిష కథానాయిక.
విజయ్ (Vijay) కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ (LEO). లలిత్ కుమార్ నిర్మాత. త్రిష కథానాయిక. సంజయ్ దత్, ప్రియాఆనంద్, అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ను చెన్నైలో మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయ్ పాత్రకు సంబంధించిన పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ పాట కోసం ఓ భారీ సెట్‌ను సిద్ధం చేశారని.. అందులోనే దాదాపు 500మంది డ్యాన్సర్లతో విజయ్‌పై ఈ గీతాన్ని చిత్రీకరిస్తున్నారని తెలిసింది. దీనికి దినేష్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఇందులో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది దసరా సందర్భంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ స్వరాలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ