Thandel: ‘తండేల్‌’ చకచకా

‘తండేల్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు.

Updated : 23 Mar 2024 11:04 IST

‘తండేల్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర వర్కింగ్‌ స్టిల్స్‌ను చిత్ర బృందం శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో చైతూ.. సాయిపల్లవి డీగ్లామర్‌ లుక్స్‌లో కనిపించారు. ఓ ఫొటోలో దర్శకుడు చందు సముద్ర నేపథ్య సన్నివేశాల్ని మినియేచర్‌ ద్వారా చైతూకు వివరిస్తూ కనిపించగా.. మరో ఫొటోలో సాయిపల్లవి సెట్లోని చిన్న పాపతో సరదాగా ఆడుకుంటూ కనిపించింది. ప్రస్తుతం ఈ స్టిల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతన్య ఇందులో రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: షామ్‌ దత్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని