Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ వచ్చేసిందోచ్‌..!

సూపర్‌స్టార్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ నుంచి మరో మ్యూజికల్‌ ట్రీట్‌ విడుదలైంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం...

Updated : 23 Apr 2022 11:23 IST

అదరగొట్టేసిన హారికా నారాయణ్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ నుంచి మరో మ్యూజికల్‌ ట్రీట్‌ విడుదలైంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం శనివారం ఉదయం ‘సర్కారువారి పాట’ టైటిల్‌ సాంగ్‌ని అభిమానులతో పంచుకుంది. ‘సరా సరా సర్కారు వారి పాట.. షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా’  అంటూ సాగే ఈ పాటను సింగర్‌ హారికా నారాయణ్‌ ఆలపించారు. తమన్‌ హై ఓల్టేజ్ మ్యూజిక్‌, హారిక గాత్రంతో ఈ పాట అందరితో డ్యాన్స్‌ చేయించేలా ఉంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ‘సర్కారువారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేశ్‌.. పొడవాటి జుట్టు, మెడపై రూపాయి టాటూతో మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. పరశురామ్‌ దర్శకుడు. మహేశ్‌కు జోడీగా నటి కీర్తి సురేశ్‌ నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్‌ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన ‘కళావతి’, ‘పెన్నీ’ పాటలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని