Twinkle Khanna: నేను నీతా అంబానీలా డాన్స్‌ చేయలేను: ట్వింకిల్‌ ఖన్నా

ట్వింకిల్‌ ఖన్నా తన పిల్లల వివాహం గురించి మాట్లాడారు.

Published : 11 Mar 2024 19:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటి హీరోయిన్‌, అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్‌ ఖన్నా (Twinkle Khanna) తన పిల్లల వివాహం గురించి ఆసక్తికర నోట్‌ పెట్టారు. ‘‘అనంత్‌ అంబానీ, రాధికా మర్చెంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో నీతా అంబానీ అద్భుతంగా డాన్స్‌ చేశారు. నేను అలా చేయలేను. అందుకే నా పిల్లలు పారిపోవాలని కోరుకుంటున్నా. అప్పుడు ఎక్కువమంది అతిథులను హోస్ట్‌ చేయడం, డాన్స్‌ చేయాల్సిన అవసరం ఉండదు. కరోనా సమయంలో ‘తమ్మా తమ్మా’ హిందీ పాటకి డాన్స్‌ చేశాను. అది చూసి దేవుడు కూడా భయపడి నా కాలు విరిగేలా చేశాడు. మా పిల్లలు మేము సంతోషంగా ఉండాలని నిజంగా కోరుకుంటే వారు పారిపోవాలి. ఎందుకంటే నేను అక్షయ్‌ అప్పుడప్పుడూ అతిథి మర్యాదల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ఎక్కువ సమయం మేలుకొని ఉండలేరు. నాకు డాన్స్‌ రాదు ’’ అని ట్వింకిల్‌ ఖన్నా నోట్‌ రాశారు. 

‘‘నీతా అంబానీ, నేను మా కుమారుల కంటే కుమార్తెల గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకంటే కొడుకుల విషయంలో తలెత్తని ప్రశ్నలు ఆడపిల్లల విషయంలో వస్తున్నాయి. వివాహం అనంతరం వారి ఇంటి పేరు మార్చుకున్నా? లేదా అదే కొనసాగిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని ట్వింకిల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని