Telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలివే!
ఇంటర్నెట్‌డెస్క్: గతవారం విడుదలైన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. మరో వారం పదిరోజుల పాటు ఈ సినిమా హవానే కొనసాగనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ మొదటి వారంలో అటు థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా!
దావూద్‌ను పట్టుకునేందుకు ముగ్గురు పిల్లలు
తాప్సీ ప్రధాన పాత్రలో ఆర్ఎస్జె స్వరూప్ తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్క్ కె.రాబిన్ స్వరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో తాప్సీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించింది. ముగ్గురు పిల్లల సహాయంతో ఆమె ఓ పెద్ద మిషన్‌ను ఎలా పూర్తి చేసింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? అన్నది మిగతా కథాంశం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఓటీటీలో రాధేశ్యామ్
ప్రభాస్, పూజాహెగ్డే హీరో-హీరోయిన్లు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెరపై ప్రభాస్-పూజా హెగ్డేల కెమెస్ట్రీ, పాటలు, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ప్రవీన్ తాంబే జీవిత కథ
భారతీయులకు అత్యంత ప్రియమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ తొలి స్థానంలో ఉంటుంది. ఇప్పటికే ఈ ఆట నేపథ్యంలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించాయి. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది.
భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రవీన్ తాంబే ఎవరు?’. శ్రేయాస్ తల్పడే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 41ఏళ్ల వయసులో ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ప్రవీన్ తాంబే.
‘ఆహా’లో హలో జూన్
లాక్డౌన్లో సమయంలో ఇతర భాషా చిత్రాలు డబ్ అయిన వరుసగా ఓటీటీలో సందడి చేసిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆ ఒరవడి కాస్త తగ్గింది. అయితే, అడపా దడపా పలు చిత్రాలు ఇంకా సందడి చేస్తున్నాయి. రాజిష విజయన్ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జూన్’. 2019లో విడుదలైన ఈ సినిమా ఫీల్‌గుడ్ మూవీగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ‘ఆహా’వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 1 నుంచి ‘హలో జూన్’ పేరుతో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా..
శర్వానంద్, రష్మిక జంటగా తిరుమల కిషోర్ తెరకెక్కించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఖుష్బూ, రాధిక, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు కూడా మిశ్రమ స్పందనే లభించింది. ఇప్పుడు సోనీలివ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు సిద్ధం చేస్తున్నారు.
ఓటీటీలో విడుదల కానున్న మరికొన్ని చిత్రాలు
అమెజాన్ ప్రైమ్
* శర్మాజీ నమ్కీన్(హిందీ)మార్చి 31
డిస్నీ+హాట్‌స్టార్
* మూన్‌నైట్ (డబ్బింగ్) మార్చి 30
* భీష్మపర్వం(మలయాళం)
నెట్ ఫ్లిక్స్
* ది లాజ్ బస్(వెబ్ సిరీస్) ఏప్రిల్1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దేవర’ ఎన్టీఆర్‌కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్‌కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి. -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్‌కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM