Vaarasudu: వారసుడి పవర్‌

‘‘ప్రేమో... భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా దానికి ట్రిపుల్‌గా తిరిగిచ్చేస్తా’’ అంటున్నాడు విజయ్‌.

Updated : 05 Jan 2023 06:48 IST

‘‘ప్రేమో... భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా దానికి ట్రిపుల్‌గా తిరిగిచ్చేస్తా’’ అంటున్నాడు విజయ్‌ (Vijay). ఆయన కథానాయకుడిగా...  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారసుడు’ (Vaarasudu). రష్మిక మందన్న (Rashmika) కథానాయిక. దిల్‌రాజు, శిరీష్‌, పవర్‌ వి.పొట్లూరి పెరల్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘పవర్‌ సీట్లో ఉండదు సర్‌. అందులోకి వచ్చి  ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటుంది. మన పవర్‌ ఆ రకం’, ‘గ్రౌండ్‌లో ఎంత మంది ప్లేయర్స్‌ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్‌ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా... ఆట, నాయకుడిని’ తరహా సంభాషణలు ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని