Veera Simha Reddy: ఓటీటీలోకి వీరసింహారెడ్డి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Veera Simha Reddy.. నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వీర సింహారెడ్డి’. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ విడుదలైంది.

Published : 12 Feb 2023 13:14 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ద్విపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 23(గురువారం) సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

అసలు కథేంటంటే..? 

జై అలియాస్ జై సింహా రెడ్డి (నందమూరి బాలకృష్ణ) (Balakrishna), ఆయ‌న‌ తల్లి మీనాక్షి (హనీ రోజ్) ఇస్తాంబుల్‌లో జీవిస్తుంటారు. అనుకోని సంఘ‌ట‌న వ‌ల్ల జై, ఈషా (శ్రుతి హాసన్) (shruti haasan) ప్రేమలోపడతారు. ఇదే విషయాన్ని ఈషా త‌న తండ్రి (మురళీ శర్మ)తో చెప్పగా.. ఓకే అనడమే కాకుండా జై కుటుంబాన్ని భారత్‌కు రమ్మని చెబుతాడు. ఈ క్రమంలోనే తన తండ్రి వీర సింహారెడ్డి (Balakrishna) బతికే ఉన్నాడనే నిజం జైకి తెలుస్తోంది. మీనాక్షి మాటతో వీర సింహారెడ్డి ఇంస్తాబుల్‌కు వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న వీరసింహారెడ్డి సోదరి భాను (వరలక్ష్మీ శరత్ కుమార్), ఆమె భర్త ప్రతాప్‌రెడ్డి (దునియా విజయ్‌) ఆయనపై దాడి చేస్తారు. అస‌లు త‌న అన్నను చంపాల‌ని భాను ఎందుకు పగ పట్టింది? ప్రతాప్ రెడ్డికి వీర సింహారెడ్డికి ఉన్న విరోధం ఏంటి? వీర సింహారెడ్డి, మీనాక్షి విడిపోవ‌డాని కార‌ణ‌మేంటి? త‌న తండ్రి గ‌తం తెలుసుకున్న జై శత్రువుల‌కు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నది మిగ‌తా క‌థ‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని