Vijay Devarakonda: సినిమాలు చేస్తున్నంతకాలం.. ఏటా ఏదో సాయం చేస్తా: విజయ్‌ దేవరకొండ

హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) తాను ఇచ్చిన నిలబెట్టుకున్నారు. వంద కుటుంబాలకు నేడు (సెప్టెంబర్‌15) రూ.లక్ష రూపాయల చెక్‌ అందజేశారు. 

Published : 15 Sep 2023 15:28 IST

హైదరాబాద్‌: హీరో విజయ్‌ దేవరకొండ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని.. వంద కుటుంబాల ఆనందానికి కారణమయ్యారు. తాజాగా ‘ఖుషి’ (Kushi) సక్సెస్‌ మీట్‌లో ఇచ్చిన మాట ప్రకారం ఎంపిక చేసిన వంద కుటుంబాలకు రూ.లక్ష రూపాయల చెక్‌ను ఆయన అందించారు. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్‌ మీడియాలో ఖాతాలో పంచుకున్న విజయ్‌.. ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే దానికి #SpreadingKushi అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు.

‘నాకు ఇప్పుడు నిజమైన సంతోషం, సంతృప్తి లభించాయని భావిస్తున్నా. మీరంతా కూడా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఆరోగ్యంగా, పనిచేస్తున్నంతకాలం ప్రతి ఏడాది ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటా. ఇవన్నీ నా వ్యక్తిగత కోరికలు. చిన్నప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగలేక నేను కొన్ని ఆనందాలకు దూరమయ్యాను. అందుకే ఇప్పుడు నా సంపాదనలో ఇలా సాయం చేస్తున్నా. మా తమ్ముడి ఇంజనీరింగ్‌ ఫీజు కట్టడానికి మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైనా రూ.లక్ష ఇస్తే బాగుండని అప్పుడు అనుకున్నా. ఇప్పుడు నేనిచ్చిన ఈ రూ.లక్ష రూపాయలు మీకు ఏదోరకంగా ఉపయోగపడి మీ అవసరాలు తీరితే అదే చాలు. మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని విజయ్ దేవరకొండ అన్నారు. డబ్బులు అందుకున్న వారు ఎవరూ తనకు థ్యాంక్స్‌ చెప్పొద్దని విజయ్‌ కోరారు. ప్రేక్షకుల అభిమానం చాలని ఆయన అన్నారు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ ‘రియల్‌ హీరో’ అంటూ ప్రశంసిస్తున్నారు.

‘ఈ ముఖాన్ని చూడటానికి థియేటర్‌కు వెళ్తారా..?’ అన్నారు: స్టార్‌ హీరోపై విశాల్‌ వ్యాఖ్యలు

ఇక సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఖుషి’ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఆరాధ్య, విప్లవ్ పాత్రల్లో సమంత (Samantha), విజయ్‌ దేవరకొండల నటనకు యూత్‌ ఫిదా అయ్యారు. దీంతో ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని