Vijay Deverakonda: అవును ఇది నిజం.. ‘గీత గోవిందం’ కాంబినేషన్‌ రిపీట్‌!

గత కొంతకాలంగా ‘గీత గోవిందం’ కాంబినేషన్‌లో మూవీ వస్తుందని టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ విజయ్‌-పరశురామ్‌ మూవీని ప్రకటించారు.

Published : 05 Feb 2023 20:45 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా పరశురామ్‌ (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘గీత గోవిందం’. 2018లో వచ్చిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, మ్యూజికల్‌గానూ మంచి హిట్‌ కొట్టింది. విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మర్చిపోలేని విజయాన్ని అందించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌ పునరావృతం కాబోతోంది. పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ కొత్త చిత్రంలో నటించనున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

‘బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌ అయిన, విజయ్‌ దేవరకొండ - పరశురామ్‌లతో కలిసి సినిమా చేస్తున్న విషయాన్ని చెప్పడానికి ఎంతో సంతోసిస్తున్నాం. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి చూడండి’ అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌, దిల్‌రాజు కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను పంచుకుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’లో నటిస్తున్నారు. సమంత కథానాయిక. త్వరలోనే మళ్లీ చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. దీంతో పాటు, గౌతమ్‌ తిన్ననూరి కథకు కూడా విజయ్‌ ఓకే చెప్పారు. మరోవైపు మహేశ్‌తో ‘సర్కారువారి పాట’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తీసి జోరుమీదున్నారు పరశురామ్‌. మరోసారి వీరి కాంబినేషన్‌లో మూవీ ప్రకటించడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని