Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ వేట మొదలైంది.. ‘లైగర్’ సర్‌ప్రైజ్‌ అదిరింది!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రంకావడం, విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా అవడంతో ‘లైగర్‌’ను ప్రకటించిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

Published : 09 May 2022 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రం కావడం, విజయ్‌ దేవరకొండ నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా అవడంతో ‘లైగర్‌’ను ప్రకటించిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పోస్టర్లు, గ్లింప్స్‌ వీడియోలతో మరిన్ని అంచనాలు నెలకొల్పాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో విజయ్‌ యాటిట్యూడ్‌ ఎలా ఉంటుంది? అసలు లైగర్‌ థీమ్‌ ఏంటి? అనే సందేహాలకు తాజాగా సమాధానం దొరికినట్టైంది. విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ‘లైగర్‌ హంట్‌’ పేరిట లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పవర్‌ఫుల్‌ గీతం అన్ని వర్గాల వారిని అలరించేలా ఉంది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం విజయ్‌ తన శరీరాకృతిని మార్చుకున్న సంగతి తెలిసిందే. సిక్స్‌ప్యాక్‌ బాడీతోపాటు పొడవాటి జుత్తుతో సరికొత్తగా కనిపించాడు. ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే అలరించనుంది. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పూరీ కనెక్ట్స్‌, ధర్మ పొడ్రక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ  సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని