Vijay Deverakonda: పవర్‌ఫుల్ రోల్‌లో విజయ్.. ఆ దర్శకుడితోనే ‘వీడీ 12’ ఫిక్స్.. స్టోరీ అదేనా?
యువ నటుడు విజయ్ అభిమానులకు సంక్రాంతి కానుక అందించారు. శుక్రవారం తన కొత్త సినిమాను ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో యువ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించే అవకాశాలున్నాయంటూ ఇటీవల వార్తొలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. #VD12 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే పట్టాలెక్కనున్న ఆ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మేరకు పోస్టర్‌ను విడుదలైంది. దాన్ని బట్టి విజయ్ పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తోంది. పోస్టర్‌లో కనిపించే ‘నేను ఎవరిని మోసం చేస్తున్నానో చెప్పేందుకు చెప్పేందుకు.. నేను ఎక్కడి వాడినో నాకు తెలియదు’ అనే కొటేషన్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. టైటిల్, నేపథ్యం, హీరోయిన్ తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
రామ్‌చరణ్ కథానాయకుడిగా గౌతమ్ గతేడాది ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. దాంతో, గౌతమ్.. చరణ్ స్థానంలో విజయ్‌ను తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రకటనరావడంతో.. రామ్‌చరణ్‌తో చేయాలనుకున్న కథనే విజయ్‌తో తీస్తున్నారా? విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు గౌతమ్ కొత్త కథ రాశారా? అనే టాక్ సినీ అభిమానుల్లో మొదలైంది. నాని హీరోగా గౌతమ్ గతంలో తెరకెక్కించిన ‘జెర్సీ’కి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుదక్కడంతో ప్రేక్షకుల్లో ఆయనపై అంచనాలున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
India News
Amritpal Singh: భారత్ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్..!
-
General News
Hyd Airport MetroP: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం భూ సామర్థ్య పరీక్షలు