Vishal: నన్ను క్షమించండి.. వైరల్‌ వీడియోపై స్పందించిన విశాల్‌

తాజాగా వైరల్‌గా మారిన తన వీడియోపై విశాల్ (Vishal) స్పందించారు. అది ప్రాంక్‌ అని తెలిపారు.

Updated : 28 Dec 2023 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో విశాల్‌కు (Vishal) సంబంధించిన ఓ వీడియో తాజాగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ వీధుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ కనిపించే ఆ వీడియోపై రకరకాల కామెంట్లు వచ్చాయి. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇలాంటి పనులు చేస్తారా అంటూ కొందరు విమర్శించారు. దీనిపై విశాల్‌ స్పందించారు.

‘‘అందరూ నన్ను క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పే సమయం వచ్చింది. అందులో కొంచెం వాస్తవం.. కొంచెం ప్రాంక్‌. లొకేషన్‌ ప్రకారం అది న్యూయార్క్‌లో తీసిందే. నేను, మా కజిన్స్‌ తరచుగా అక్కడకు వెళ్లి సరదాగా గడుపుతుంటాం. నా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఏడాదంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి న్యూయార్క్‌కు వెళ్తాం. ఆ వీడియోలో నేను మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్‌. క్రిస్మస్‌ రోజు నాతో సరదాగా మా కజిన్స్‌ అందరూ ప్రాంక్‌ వీడియో చేశారు. నన్ను ఆటపట్టించడం కోసం చేశారంతే. అలా చేయాలని నాతో చెప్పి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పటికైనా దానిపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని ఆశిస్తున్నా. కొంతమంది ఆ వీడియో వీక్షించి నన్ను టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినీ ద్వేషించాలని అనుకోవడం లేదు’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘స్పిరిట్‌’లో ప్రభాస్‌ పాత్ర ఇలానే ఉంటుంది..: నిర్మాత ప్రణయ్

ఇక సినిమాల విషయానికొస్తే.. విశాల్ ప్రస్తుతం ‘రత్నం’ (Rathnam)లో నటిస్తున్నారు. హరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని