Yash: ‘కేజీయఫ్‌3’ పై ఆసక్తికర విషయాలు చెప్పిన యశ్‌.. ఏమన్నాడంటే..

యఫ్‌’ సినిమా ఒక ట్రెండ్‌ సెట్‌ చేసింది. ప్రస్తుతం హీరో యశ్‌ ఆ ఆనందంలోనే ఉన్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.1000 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.

Published : 28 Apr 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌’ సినిమా ఒక ట్రెండ్‌ సెట్‌ చేసింది. ప్రస్తుతం హీరో యశ్‌ ఆ ఆనందంలోనే ఉన్నారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.1000 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది.  తాజాగా యశ్‌ ‘కేజీయఫ్‌3’ పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీని కోసం కొన్ని సన్నివేశాలు సిద్ధంగా ఉన్నాయన్న యశ్‌. తనతో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కు చాప్టర్‌3 తీయాలన్న ఆలోచన ఉందన్నారు. ‘కేజీయఫ్‌ సినిమా మొదలు పెట్టినప్పుడు ఒక్కటే సినిమా అనుకున్నాము. కానీ, సినిమా మధ్యలో ప్రశాంత్‌నీల్‌ చాప్టర్‌2 తీయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కారణం కొన్ని సన్నివేశాలు హడావిడిగా ఉన్నాయని అలా ఉంటే ప్రేక్షకులు ఇష్టపడరని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుల మనసుకు చేరువయ్యేలా రూపొందించాడు. అందుకు అనుగుణంగా సినిమాలో మార్పులు చేసుకుంటూ వచ్చాము. కొన్ని సన్నివేశాలను చాప్టర్‌2 కోసం అని పక్కన పెట్టినప్పుడు నేను చాలా ఆందోళన చెందాను. ఒకవేళ చాప్టర్‌1 హిట్‌ అవ్వకపోతే ఇంత మంచి సీన్స్‌ చేయలేకపోతామేమోనని భయపడ్డాను. కానీ ఈ రెండు భాగాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకి చాలా సంతోషిస్తున్నాను.’ అని చెప్పారు.

ఇక కేజీయఫ్‌2 ప్రమోషన్స్‌లో భాగంగా ‘మొదటి భాగంలానే రెండో భాగాన్నీ ప్రేక్షకులు ఆదరిస్తే పార్ట్‌-3 గురించి ఆలోచిస్తా’ అని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రశాంత్‌ నీల్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వరుస సినిమాలతో బిజీ అయ్యాడు ఈ డైరెక్టర్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని