షార్లెట్‌ నగరంలో బాలయ్య అభిమానుల సందడి..

అమెరికాలొని నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. షార్లెట్ బాలయ్య అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పురుషోత్తం చౌదరి గుడే,  ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర వీరసింహారెడ్డి ప్రీమియర్ షో నిర్వహించి కేక్ కట్ చేశారు. 

Published : 13 Jan 2023 10:24 IST

అమెరికాలొని నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. షార్లెట్ బాలయ్య అభిమానుల సంఘం ఆధ్వర్యంలో పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర వీరసింహారెడ్డి ప్రీమియర్ షో నిర్వహించి కేక్ కట్ చేశారు. ఒక పండుగ మాదిరిగా ప్రీమియర్ షో వీక్షించారు. ఈ సందర్భంగా పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని, దేవరాజ్ మాట్లాడుతూ.. ‘‘RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. భారతీయులుగా మనం గర్వపడాలి. బాలయ్య అభిమానులుగా మేము రెండు తెలుగు సినిమాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలని కోరుకుంటున్నాం. తెలుగు ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతున్న రోజుల్లో.. దయ చేసి రాజకీయ లాభాల కోసం సమాజాన్ని విభజించవద్దు. అందరి అభిమానులు, అన్ని పార్టీల ప్రజలు అమెరికాలో మంచి సామరస్యంతో కలిసి జీవిస్తున్నారు’ అని చెప్పారు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు