Ukraine: ఉక్రెయిన్‌ను వీడండి..: భారతీయులకు విదేశాంగ శాఖ హెచ్చరిక

ఉక్రెయిన్‌లో నివశించే భారతీయులు వీలైతే దేశాన్ని వీడాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ఓ ప్రకటన చేసింది.

Updated : 15 Feb 2022 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లో నివసించే  భారతీయులు వీలైతే దేశాన్ని వీడాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఈ మేరకు కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ఓ ప్రకటన చేసింది. ‘‘ఉక్రెయిన్‌లోని అస్థిర పరిస్థితులను భారతీయులు దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేని విద్యార్థులు తాత్కాలికంగా దేశం వీడే అంశాన్ని పరిశీలించాలి’’ అని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలు వస్తోన్న నేపథ్యంలో  భారత్‌ ఈ హెచ్చరికలను జారీ చేసింది.

ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్‌ నుంచి తమ దేశ ప్రజలను వెనక్కి వచ్చేయాలని పిలుపునిస్తున్నాయి.  ఈ దేశాల జాబితాలో అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌, ఐర్లాండ్‌, బెల్జియం, లక్సంబర్గ్‌, ది నెదర్లాండ్స్‌, కెనడా, నార్వే, ఇస్తోనియా, లిథువేనియా, బల్గేరియా, స్లొవేనియా, ఆస్ట్రేలియా, జపాన్‌, ఇజ్రాయెల్‌, సౌదీ, యూఏఈ ఉన్నాయి. 

రష్యా దాడి చేయడం ఖాయమని ఉక్రెయిన్‌ సహా పలు దేశాలు విశ్వసిస్తున్నాయి. రష్యా మద్దతు ఉన్న బలగాలు డాన్‌బాస్‌ ప్రాంతాన్ని నియంత్రిస్తున్నాయి. గత  48 గంటలుగా రష్యా దళాలు సరిహద్దుల వద్ద మోహరింపులను పెంచాయి. ఈ విషయం బెల్జియంకు చెందిన ఓ సంస్థ ఉపగ్రహ చిత్రాలతో సహా వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని