యూరప్‌లోని పలు నగరాల్లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

Updated : 22 Apr 2022 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యూరప్‌లోని పలు నగరాల్లో ఎన్‌ఆర్‌ఐ తెదేపా నాయకులు కిషోర్ చలసాని ఆధ్వర్యంలో నవీన్ సామ్రాట్ జలగడుగు, శ్రీనివాస్ గోగినేని, శ్యామ్ సుందర్ రావు ఊట్ల గారి సమన్వయంతో చంద్రబాబు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ ఉన్నతికి కారణం అయిన చంద్రబాబు తమలాంటి ఎంతో మందిని తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఐటీ రంగాన్ని ప్రోత్సహించారని ప్రశంసించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి వివిధ అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ కోసి వేడుకలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ హైటెక్‌ సిటీ కట్టింది ఆయనే, రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన నారాయణ్‌ని ఎంపిక చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఆయనే, దేవగౌడ ప్రధాని కావడానికి కీలక పాత్ర పోషించింది ఆయనే, బీసీలకు 33శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తుశుద్ధితో చేపట్టి అమలు చేసిన నాయకుడు ఆయనే, మీ సేవ అంటూ సేవలు అందించింది ఆయనే, ఎస్సీ, ఎస్టీ సంక్షేమాలకి కమిషన్ ఏర్పాటు చేసింది ఆయనే, ప్రపంచంలోనే హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్ రెండో కేంద్రంగా చేసి ఐటీ హబ్ గా భాగ్యనగర బతుకును మార్చింది ఆయనే, విజన్ 2020 అంటూ భావితరాల కోసం ప్రణాళిక రచించిన నాయకుడు ఆయనే, నవ్యాంధ్ర నిర్మాత ఆయనే, అమరావతి నిర్మించేది ఆయనే, పోలవరం పూర్తి చేసేది ఆయనే, 2024లో సీఎం కుర్చీ ఎక్కేదీ ఆయనే’’  ఆయనే నారా చంద్రబాబు నాయుడు అంటూ జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు ప్రజల కీర్తిని తెలుగు జాతి ఘనతలని చంద్రబాబు నలు దిక్కులా చాటారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దేశవిదేశాలకు వెళ్లి ఐటీ కంపెనీల అధినేతలను ఒప్పించి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య రెడ్డి, జగదీశ్‌ మెడిశెట్టి, ధనంజయ్‌ గుజ్జల తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని