Daggubati Purandeswari: ‘చంద్రబాబు అరెస్టుతో భాజపాకు సంబంధం లేదు’

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన అరెస్టును తొలుత ఖండించింది తమ పార్టీయేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.

Updated : 18 Sep 2023 07:31 IST

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన అరెస్టును తొలుత ఖండించింది తమ పార్టీయేనని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం కరెక్టు కాదని అభిప్రాయడ్డారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, మాట్లాడారు. ‘తెదేపాతో కలిసి పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. ఈ అంశంపై ఆయన భాజపా అధిష్ఠానంతో చర్చిస్తానని చెప్పారు. ఆ సమయంలో మా అభిప్రాయాన్నీ చెబుతాం. ప్రస్తుతం జనసేన, భాజపా పొత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో సీఐడీ ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోంది. చంద్రబాబు అరెస్టులో భాజపా ప్రమేయం ఉందంటూ వైకాపా అసత్య ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పార్టీ పెద్దలంతా చంద్రబాబు అరెస్టును ఖండించారు’ అని వెల్లడించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాతూరి నాగభూషణం, అడ్డూరి శ్రీరామ్‌, షేక్‌ బాజీ, పొట్టి శ్రీహరి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని