Nara Lokesh: బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని తీసుకొస్తాం: నారా లోకేశ్‌

Updated : 10 Apr 2024 12:59 IST

మంగళగిరి: తెదేపా అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్టుమెంట్‌ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. మండుటెండల్లోనూ రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్న తెదేపా అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారని.. ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం మూడు రోజులకోసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదని తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

‘యువగళం’పై పుస్తకం ఆవిష్కరణ

‘యువగళం’ పాదయాత్రపై సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణకిషోర్ రచించిన ‘శకారంభం’ పుస్తకాన్ని లోకేశ్‌ ఆవిష్కరించారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2,300 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించామని చెప్పారు. కృష్ణకిషోర్‌, పుస్తక ప్రచురణకర్త బొడ్డు వెంకటరమణ చౌదరికి ఆయన అభినందనలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని