Ts News: పబ్‌లు తెరిస్తే రాని కరోనా.. భాజపా నేతలు దీక్ష చేస్తేనే వస్తుందా?: విజయశాంతి

సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తేలుస్తుందని భాజపా సీనియర్ నేత విజయశాంతి అన్నారు. వివిధ జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూమిని

Published : 04 Jan 2022 01:49 IST

హైదరాబాద్: సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం తేలుస్తుందని భాజపా సీనియర్ నేత విజయశాంతి అన్నారు. వివిధ జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూమిని అమ్మేసి బినామీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దానికి సంబంధించిన నివేదికలు పార్టీ అధిష్ఠానానికి వెళ్లాయని.. సరైన సమయంలో చర్యలు తీసుకుంటుందన్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసంలో విజయశాంతి మీడియాతో మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆక్షేపించారు. భాజపా నాయకులను కరీంనగర్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 31న పబ్‌లు తెరిస్తే కరోనా రాదు.. రైతుబంధు ఉత్సవాలు జరిపితే కొవిడ్‌ రాదు.. భాజపా నేతలు దీక్ష చేస్తేనే వస్తుందా?అని ప్రశ్నించారు. తెరాస, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్‌తో పాటు భాజపా కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని