ఎల్‌పీఎల్‌లో భారత మాజీ క్రికెటర్..
లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్)-టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక చేరుకున్నట్లు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఎల్‌పీఎల్‌లో కండ్యా టస్కర్స్ ఫ్రాంఛైస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి పఠాన్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. ‘శ్రీలంకలో ఉన్నాను. ఎల్‌పీఎల్-టీ20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
ఇంటర్నెట్ డెస్క్: లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్)-టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక చేరుకున్నట్లు భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఎల్‌పీఎల్‌లో కండ్యా టస్కర్స్ ఫ్రాంఛైస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి పఠాన్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. ‘శ్రీలంకలో ఉన్నాను. ఎల్‌పీఎల్-టీ20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ప్రయాణం కొత్తగా ఉంది #ఎల్‌పీఎల్-టీ20,#క్రికెట్’అని పఠాన్ ట్వీట్ చేశాడు. కండ్యా జట్టులో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, కుషాల్ పెరీరా, లంక టీ20 స్పెషలిష్ట్ క్రికెటర్ కుషాల్ మెండీస్, నువాన్ ప్రదీప్, ఇంగ్లాండ్ కుడిచేతి వాటం బౌలర్ లైమ్ ప్లంకెట్ ఉన్నారు. కొలొంబో, కండ్యా, గాలె, దంబుల్లా, జఫ్నా అయిదు ఫ్రాంఛైస్ జట్లు ఈ ఎల్‌పీఎల్-టీ20లో తలపడనున్నాయి. కొలొంబో, కండ్యా జట్ల మధ్య మొదటి మ్యాచ్ మహేంద్ర రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హంబంటోటాలో నవంబర్ 26న జరగనుంది. డిసెంబర్ 13, 14న సెమీ ఫైనల్స్, 16న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!