
‘షారుఖ్ వార్నర్’ని చూశారా?
పోనీ.. ‘డేవిడ్ రోషన్’ని ???
ఇంటర్నెట్ డెస్క్: ఆసక్తికరమైన వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకోవటంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తనకు తానే సాటి. 50 లక్షల మందికి పైగా ఆయన ఇన్‌స్టా ఖాతాను ఫాలో అవుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. తన భారతీయ సినిమాల్లోని సూపర్‌హిట్ పాటలకు తాను చేసిన నృత్యాలతో అభిమానులను తరచు హుషారు చేయటం 34 ఏళ్ల వార్నర్‌కు అలవాటే. ఐతే ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ ఈసారి మరో కొత్త అవతారంతో ముందుకొచ్చాడు. రీఫేస్ యాప్ ద్వారా ఇప్పటికే హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ తదితర బాలీవుడ్ సూపర్ స్టార్లుగా కనిపించిన వార్నర్.. ఇప్పుడు మరో గెటప్‌లో అదరగొట్టాడు. తాను షేర్ చేసిన వీడియోలోని యాక్షన్ సన్నివేశాలు ఏ హీరోకి చెందినవో కనుక్కోవాలంటూ సవాలు కూడా విసిరాడు.
కాగా, అది తమ అభిమాన హీరో, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అంటూ పలువురు ఆయనకు సమాధానమిచ్చారు. 2011లో విడుదలైన హిందీ చిత్రం ‘డాన్ 2’కు సంబంధించిన అదరగొట్టే యాక్షన్ దృశ్యాల్లో.. వార్నర్ షారుఖ్ ఖాన్ పాత్రలో కనిపిస్తాడు. అతను కింగ్ ఖాన్‌గా కనిపించే సదరు వీడియోకు.. ‘డాన్ 2’ దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో సహా పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు.
కాగా, షారుఖ్-వార్నర్ వీడియోను 24 గంటలు గడవకుండానే పదిలక్షల మందికి పైగా చూడటం విశేషం. ఇక వార్నర్ హృతిక్ రోషన్‌గా ఆయన నటించిన వివిధ చిత్రాల్లోని పాత్రల్లో కనిపించిన వీడియో అయితే ఏకంగా 23 లక్షలకు పైగా వ్యూస్‌ని స్వంతం చేసుకుంది. దీనితో భారతీయ సినిమాల్లో నటించాల్సిందిగా చాలామంది వార్నర్‌కు సలహా ఇస్తున్నారట!
ఇవీ చూడండి..
కేటీఆర్ మెచ్చిన ఫుట్‌బాల్ ఫీట్..