ధోనీ వ్యాఖ్యలను వ్యతిరేకించిన మరో మాజీ క్రికెటర్‌

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లో సోమవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం చెన్నై సారథి ధోనీ తమ జట్టులోని యువ ఆటగాళ్లపై చేసిన...........

Published : 21 Oct 2020 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లో సోమవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం చెన్నై సారథి ధోనీ తమ జట్టులోని యువ ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ధోనీ మాటలను ఖండించగా.. తాజాగా ఆ జాబితాలో టీంఇండియా మాజీ ఎడమ చేతివాటం స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా చేరాడు. 

స్పల్ప లక్ష్యాన్ని రాజస్థాన్‌ ముందు ఉంచిన చెన్నై దాని కాపాడుకోలేక పరాజయం పాలైంది. ఈ క్రమంలో చెన్నై జట్టు కూర్పుపై మాట్లాడిన ధోనీ యువ ఆటగాళ్లకు ఆడాలనే కసి కనిపించలేదన్నారు. అందుకే వాళ్లకు తుది జట్టులో స్థానం కల్పించలేదని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో ఓజా విభేదించాడు. ఈ కారణంతో తుది జట్టులోకి వాళ్లను ఎంపిక చేయకపోవడంపై ఓజా ధోనీపై అసహనం వ్యక్తం చేశాడు. జట్టులో కేదార్‌ జాదవ్‌, పీయూష్‌ చావ్లా ప్రాతినిధ్యాలపై ధోనీని ఈ స్పిన్నర్‌ ప్రశ్నించాడు.

రుతురాజ్‌ గైక్వాడ్‌, నారాయన్‌ జగదీషన్‌లను ఉద్దేశించి టీంఇండియా మాజీ సారథి ఈ వ్యాఖ్యలు చేయటం అన్యాయమని ఓజా అన్నాడు. చెన్నై జట్టులో ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లకు ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాలేదని ఓజా పేర్కొన్నాడు. ఒకటి రెండు అవకాశాలు ఇచ్చి వాళ్లలో ఆడాలనే కసి కనిపించలేదనడం దారుణమని అభిప్రాయపడ్డాడు. పది మ్యాచుల్లో ఏడింటిలో ఓడిపోయిన చెన్నై జట్టు ఫ్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని